పేద- మధ్యతరగతి కుటుంబాలకు ఎవరు ఊహించని హామీ ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపు ఖాయం అనే దిశగా ప్రతిపక్ష పార్టీ వైసిపి పార్టీ అధినేత జగన్ ప్రచారంలో చూసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా తన ప్రచారంలో ప్రసంగంలో పాదయాత్ర అనుభవాలను ప్రజలకు గుర్తుచేస్తూ తన ప్రభుత్వం వస్తే సంక్షేమం ఏ విధంగా ఉంటుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నారు జగన్.
ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుంటుంబాలకు మేలు జరిగేలా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకన్నారు. పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో లబ్ధి చేకూర్చుతుందని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైద్యం ఖర్చు రూ.1000 దాటితే యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా సహాయం అందుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఊరట లభిస్తుందని జగన్ చెప్పారు.