మరో ఐదు రోజుల్లో ఆంధ్రాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టైమ్స్‌నౌ-సీఓటర్ సర్వే విడుదల చేసిన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 2014 ఎన్నికల్లో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మరి వైసీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ...వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన క్రమంలో అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కొద్దిపాటి తేడా ఓటింగ్ శాతం తో అధికారం కోల్పోయిన...రాష్ట్రంలో చంద్రబాబు చేసిన మోసాలపై అద్భుతంగా పోరాడారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ముఖ్యంగా తమ పాదయాత్రతో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. కూటమిగా ఉన్న టిడిపి- బిజెపి -జనసేన పార్టీలను మూడుగా చీల్చివేసి అధికార పార్టీ టీ డీ పీ ని టార్గెట్ చేసి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి చెమటలు పట్టించాడు జగన్. రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేకతను తన పాదయాత్ర ద్వారా అద్భుతంగా పైకి తీసుకువచ్చి..ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ కూడా ఓటు మరియు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వంటి విషయాల గురించి మాట్లాడాలని స్థితిలోకి తీసుకెళ్లిపోయారు జగన్ అని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి కామెంట్ చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న చాలా సర్వేలలో వైసీపీ పార్టీ విజయం తథ్యమని ఫలితాలు వచ్చిన నేపథ్యంలో తాజాగా దేశంలో నె అతి పెద్ద టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే తాజాగా తన సర్వే ఫలితాలను విడుదళ చేసింది. సర్వే ఫలితాల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని పేర్కొంది. టైమ్స్‌నౌ-సీఓటర్ సర్వేలో వైసీపీ 50.5 శాతం ఓట్లతో 130 సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని తెలిపింది. ఇక టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. 37.7 శాతం ఓట్లతో 44 సీట్లుగెలుచుకొని రెండో స్థానంలో ఉండనుందని సర్వేలో తేలింది. ముఖ్యమంత్రిని అవుతా అని ప్రగల్భాలు పలుకుతున్న పవన్ పార్టీ జనసేన మాత్రం 9.0 శాతం ఓట్లతో ఒక్క సీటును గెలువనుందంట. జగన్ కి ఈసారి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలంతా అనుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.