2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఆ సమయంలో పోటీ చేయకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి గల కారణాలు ప్రధాన కారణమయ్యారు పవన్ కళ్యాణ్ అని చాలా మంది అంటుంటారు. రాజకీయాలను అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన పవన్ తాను 2014 ఎన్నికల్లో మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీని మొదటి నాలుగు సంవత్సరాలు ప్రశ్నించిన దాఖలాలు లేవు.
అయితే ప్రస్తుతం ఎన్నికలకు సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉపసంహరించుకునే స్వతంత్రంగా పోటీ చేయడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్ ...ఎన్నికల ప్రచారంలో ఎకౌంట్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ నే టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడంతో తాజాగా తన చివరి సభను జగన్ గాజువాక లో పెట్టినట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఈ ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చీకటిలో కలుసుకుని ప్రజల ముందు విడిపోయినట్లు నటిస్తున్నారని ఇందుమూలంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు గాజువాక నియోజకవర్గం లో చంద్రబాబు పర్యటించకుండా నాటకాలు ఆడుతున్నారని వైసిపి పార్టీకి చెందిన నేతలు చాలామంది ఇప్పటికే కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా తన చివరి సభ వైసీపీ పార్టీ అధినేత గాజువాక నియోజకవర్గం లో పెట్టడంతో ఇప్పటికే జనసేన పార్టీ గెలుపు ఖాయం అనే సంతోషంలో ఉన్నా జనసేన కార్యకర్తలకు ఊహించని విధంగా సంచలన విషయాలు జగన్ ఈ సభలో టీడీపీ జనసేన పార్టీలో రహస్య ఒప్పందాలు గురించి బయటపెడుతున్నట్లు ఏపీ పాలిటిక్స్ లో వినపడుతున్న టాక్.