పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటున్న సోము వీర్రాజు..!

By Xappie Desk, April 07, 2019 09:46 IST

పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటున్న సోము వీర్రాజు..!

పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటున్న సోము వీర్రాజు..!
 
జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సామాజికవర్గానికి ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చెడగొట్టారని ఆయన అబిప్రాయపడ్డారు. రాజకీయాలలో ఎవరి కొమ్ము కాయడానికో పవన్ కళ్యాణ్ ,తనను నమ్ముకున్న సామాజికవర్గాన్ని నట్టేట ముంచారని అన్నారు. పవన్‌ సామాజికవర్గం వారు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో బీజేపీ 2014 సెప్టెంబరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తమ పార్టీతో కలిసిపోవాలని కోరిందని వీర్రాజు చెప్పారు.
 
అప్పుడే గనుక పవన్‌కల్యాణ్‌ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా సీఎం పదవి రేసులో ఉండేదని చెప్పారు.రాజకీయాల్లో దార్శనికత గురించి చెప్పే పవన్‌కల్యాణ్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. 2014లో పవన్‌క ల్యాణ్‌ను తానే నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లానని, అప్పటి ఎన్నికల్లో బీజేపీ– జనసేన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తే.. పవన్‌కల్యాణ్‌ టీడీపీతో కలిసి మూడు పార్టీలు పోటీ చేయాలని సూచించారన్నారు. ఏడాది క్రితం జనసేన అవిర్భావ సభలోనూ తనను అభిమానించే సామాజికవర్గం చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని గ్రహించి టీడీపీపై పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేశారని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి కలిగించేలా.. ఓట్లను చీల్చడానికే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.Top