నా హయాంలో భూకబ్జాలు ఉండవు టిడిపి పార్టీ లాగా: పవన్ కళ్యాణ్..!
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న క్రమంలో వడదెబ్బ తగిలి చికిత్స చేయించుకునే తిరిగి ప్రచారానికి మరింత స్పీడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రాబోతున్న ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో వంటి విషయాలను తెలియజేస్తున్నారు పవన్.
మరి ఇదే క్రమంలో రాష్ట్రంలో రౌడీయిజం ఉండదని సమాజంలో అందరూ ఒకేలా బతికేలా పరిపాలన ఉంటుందని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారి మాదిరి తాము బూ కబ్జాలకు పాల్పడేవారం కాదని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తనకు నచ్చిన అతికొద్ది మందిలో నాదెండ్ల మనోహర్ ఒకరని ఆయన చెప్పారు. తెదేపా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. వ్యవస్థలు నాశనమైతే ఊరుకొనే ప్రసక్తేలేదన్నారు. కులాల ఐక్యత కోసమే జనసేన పాటు పడుతుందని చెప్పారు. నేతలకు కులం, మతం, ప్రాంతం అనేది ఉండకూడదన్నారు. తాను ఎంత మెత్తగా కనిపిస్తానో ప్రజల జోలికి వస్తే అంతే కఠినంగా ఉంటానన్నారు.