విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో..!

Written By Xappie Desk | Updated: April 07, 2019 10:00 IST
విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో..!

విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో..!
 
ఉగాది పర్వదినం నాడు వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఉన్న పార్టీ కార్యాలయంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి అందరూ షాక్ అయ్యేటట్లు కామెంట్ చేశారు జగన్. నేను విడుదల చేసిన మేనిఫెస్టో మా పార్టీ వెబ్ సైట్ లో వచ్చే ఎన్నికల వరకు ఉంటుందని చంద్రబాబు మాదిరిగా 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టో పార్టీ వెబ్ సైట్ లో పెట్టి తర్వాత తీసి వేసే కార్యక్రమాలు ఉండవని..మనసా వాచా కర్మణా తో చెబుతున్నానని చెప్పేది చేసే వ్యక్తిత్వం నాది అంటూ మ్యానిఫెస్టో లో ఉన్న అంశాలను మీడియాతో పంచుకున్నారు.
 
ఈ మానిపెస్టోని నిత్యం తమ వద్దనే ఉంచుకుంటామని, సమీక్షించుకుని అమలు చేస్తామని, అదికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి ఓటు అడుగుతామని జగన్ అన్నారు. నవరత్నాలలో ప్రకటించిన అంశాలకు ప్రాదాన్యత ఇచ్చామని ఆయన చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, బిసి డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలు కూడా జత చేశామని అన్నారు. రైతుకు పంట వేసుకునే సమయంలో పెట్టుబడి సాయం కింద 12500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని, రైతుల భీమాను ప్రభుత్వం చెల్లిస్తుందని, ఉచితంగా బోర్లు , పగటి పూట ఉచిత కరెంటు, ఆక్వారైతులకు రూపాయన్నరకే విద్యుత్ యూనిట్ చార్జీ,మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిది, నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిది మొదలైన హామీలను జగన్ ప్రకటించారు. భూ యజమానులకు ఇబ్బంది లేకండా కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని జగన్ ప్రకటించారు.వడ్డీలేని రుణాలు కూడా రైతులకు ఇస్తామని ఆయన చెప్పారు.
Top