ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లో నాకు అభ్యంతరం ఏమీ లేదని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలో మద్దతు తెలుపుతామని మీడియా ముందు చెప్పా కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకం ప్రాంతీయ పార్టీలు అవ్వాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అయితే దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని చెప్పిన క్రమంలో తాజాగా కెసిఆర్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కి కెసిఆర్ ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కెసిఆర్ వేలు పెట్టడం మంచిది కాదని ...ఆంధ్రాలో రాజకీయాలలో కేసీఆర్ వెనక్కి తగ్గితే మంచిదని సూచించారు. అంతేకాకుండా ఒకవేళ కెసిఆర్ గనక ఏపీలో జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పేరుతో అభ్యర్థులను నిలబెడితే సంతోషిస్తామని పవన్ సెటైర్లు విసిరారు. వెనకదారి నుండి మాత్రం జగన్ కి సహకరించడం సరి కాదని అన్నారు. తనకి ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని, వారి ఆలోచన విధానం వలనే ఇలా ఇబ్బందికి గురవుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.