Advertisement

జగన్ గురించి అదిరిపోయే ప్రశ్నలు వేసిన చంద్రబాబు, ప్రత్యర్థులు కూడా అలాగే కౌంటర్లు వేశారు..!

by Aravind Peesapati | April 08, 2019 19:00 IST
జగన్ గురించి అదిరిపోయే ప్రశ్నలు వేసిన చంద్రబాబు, ప్రత్యర్థులు కూడా అలాగే కౌంటర్లు వేశారు..!

జగన్ గురించి అదిరిపోయే ప్రశ్నలు వేసిన చంద్రబాబు, ప్రత్యర్థులు కూడా అలాగే కౌంటర్లు వేశారు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీ అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ వైసిపి పార్టీ అధినేత జగన్ కేసుల గురించి ప్రస్తావిస్తూ జగన్పై 31 కేసులు ఉన్నాయని ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకువస్తారో ప్రజలే ఆలోచించాలి అంటూ సూచించారు చంద్రబాబు. ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే వెరిఫికేషన్ చేస్తారని, అలాంటిది 31 కేసులున్న జగన్ పెట్టుబడుల కోసం విదేశాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. అన్ని కేసులున్న ఆయన్ను నమ్మి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని అడుగుతున్నారు. అంతేకాదు మొదటిసారి ఓటు వేస్తున్నవారు జగన్ మోహన్ రెడ్డికి వేస్తే నేరాల పార్టీకి ఓటు వేశామే అని జీవితాంతం బాధపడాల్సి వస్తుందని యువతకు చెప్పమని నేతలను పురమాయించారు. చంద్రబాబు మాటల్లో లాజిక్ లేకపోలేదు. ఇదే క్రమంలో చంద్రబాబు మాటలు విన్న ప్రత్యర్థి పార్టీ నేతలు 31 కేసులో ఉన్న వ్యక్తి ఇంకా బయటే ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నారు అంతటి నేరచరిత్ర జగన్ కి ఉంటే జగన్ తప్పు చేసి ఉంటే రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో అబద్ధపు ఆధారాలు లేని రాజకీయంగా పెట్టిన కేసులను ప్రజలకు చూపిస్తూ మరొకసారి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్న చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తున్నారు. నిజంగా జగన్ తప్పు చేసి ఉండి ఉంటే ప్రజల మధ్య ఇంత ధైర్యంగా ఎందుకు తిరుగుతారు న్యాయ స్థానాలలో ఎందుకు పోరాటాలు చేస్తారు..నీలాగా స్టేలు తెచ్చుకొని రాజకీయాలు చేస్తారు కదా అని చంద్రబాబు పై సంచలన కామెంట్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.


Advertisement


Advertisement


Top