నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళకి పాలాభిషేకం చేస్తా: పోసాని కృష్ణ మురళి..!

Written By Xappie Desk | Updated: April 09, 2019 12:10 IST
నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళకి పాలాభిషేకం చేస్తా: పోసాని కృష్ణ మురళి..!

నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళకి పాలాభిషేకం చేస్తా: పోసాని కృష్ణ మురళి..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ లో కీలకంగా వ్యవహరించిన నటుడు శివాజీ ఇటీవల మీడియా సమావేశం పెట్టి జగన్ గురించి మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలపై సీనియర్ రచయిత వైసిపి పార్టీకి మద్దతు తెలిపిన పోసాని కృష్ణ మురళి కౌంటర్లు వేశారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో నటుడు శివాజీ చంద్రబాబు దయ్యమని చెప్పి ఇప్పుడు చంద్రబాబు దేవుడని అంటున్నారని మధ్యలో ఈ మార్పు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
 
ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి పార్టీ పెట్టిన క్రమంలో రాష్ట్రంలో చిరంజీవి అధికారంలోకి వస్తారేమోనని భయంతో చంద్రబాబు చిరంజీవి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలపై తనకు అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా చేత అసభ్యకరమైన కథనాలు ప్రసారం చేశారని ఇటువంటి దారుణమైన నీచమైన రాజకీయాలు చేసే చంద్రబాబుతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులు కలపడం దారుణమని...ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసని అటువంటి వ్యక్తుల తో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి రాజకీయాలు చేయడం దురదృష్టం అని పేర్కొన్నారు.
 
అయితే ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నదేమిటంటే ప్రజల కోసం నిస్వార్ధంగా, నిజాయితీగా పోరాడుతున్న వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. ఇటువంటి క్రమంలో 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దారుణంగా అవినీతిమయం చేసిన చంద్రబాబు ని దూషించకుండా కేవలం జగన్ ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని జగన్ క్రెడిబులిటీ ఉన్న పొలిటీషియన్ ని అతను అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళ కి పాలాభిషేకం చేస్తాం అని పోసాని పేర్కొన్నారు.
Top