ఏపీ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్న తూర్పుగోదావరి జిల్లా ఓటర్లు..!
2019 ఎన్నికలలో ఆంధ్రాలో ఏ పార్టీకి అధికారం వస్తుందోననే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి కానీ ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. ఇటువంటి క్రమంలో ఆంధ్రరాష్ట్రంలో అధికారాన్ని డిసైడ్ చేసేది ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా ఓటర్ అని ఆ జిల్లాలో ఓటరు యొక్క నాడి బట్టి ఆంధ్రాలో ఎవరిదో అధికారం చెప్పవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు ఎంత మర్యాద ఇస్తారో అదేవిధంగా తమ బిడ్డల కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారని ఓటు కూడా అదే విధంగా వేస్తారని అసలు 1994వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేని క్రమంలో ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఆదరించారని ఇండిపెండెంట్ లను సైతం కూడా గెలిపించిన ఘనత తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు దక్కుతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
ఇదే క్రమంలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి గల ముఖ్య కారణాలలో తూర్పుగోదావరి జిల్లా కూడా ఒకటని అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు ఎక్కువగా వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబుకు ఓటేస్తే జిల్లాకి కనీస అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేయలేదని..అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. అయితే ఈసారి మాత్రం జగన్ కి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సర్వేలలో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంటున్నట్లు టాక్.