ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కి ఘాటైన కౌంటర్లు వేసిన కెసిఆర్..!

Written By Xappie Desk | Updated: April 09, 2019 12:24 IST
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కి ఘాటైన కౌంటర్లు వేసిన కెసిఆర్..!

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కి ఘాటైన కౌంటర్లు వేసిన కెసిఆర్...!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కెసిఆర్ అడ్డుపడుతున్నారని ప్రత్యేక హోదా ఏపీకి రాకపోవడానికి గల ముఖ్య కారణాలలో కేసీఆర్ కూడా ఒకరిని పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కెసిఆర్ ఎన్నోసార్లు ఆపాలని కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపారు అంటూ చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్లు వేశారు.
 
తనకు ఆంధ్ర ప్రజలతో ఎటువంటి గొడవలు లేవని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆంధ్ర ప్రజలతో పాటు నేను కూడా సంతోషిస్తానని పక్కన ఉన్నవారు బాగుపడితే సంతోషం పడటం తెలంగాణ సంస్కృతి అంటూ చంద్రబాబు లాగా పక్కన వాడిని ముంచేయడం నాకు తెలియదు అంటూ ఘాటైన కౌంటర్లు వేశారు. ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ...తెలంగాణకు కుట్రలు చేయడం రాదు. లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదన్నారు. గోదావరి జలాలు వేస్ట్ గా సముద్రం పాలవుతున్నాయని ఆ నీటినంతా రెండు తెలుగు రాష్ట్రాలు అవసరాలకు ఉపయేగించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కట్టుకోమని చెప్పాం. మా వాటా మాకు కావాలన్నామే తప్ప పోలవరం కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదనిన్నారు.
Top