వైసీపీ అధినేత జగన్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ అద్భుత విశ్లేషణ..!
తెలుగు రాజకీయాలను వడపోసే విశ్లేషణలు చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ తాజాగా వైసీపీ పార్టీ అధినేత జగన్ గురించి ఎన్నికల ముందు చేసిన విశ్లేషణ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజకీయాలలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుని జగన్ అద్భుతంగా ఎదుర్కొన్నారని పక్క క్లారిటీతో అధికార పార్టీ టీడీపీ పై అద్భుతమైన పోరాటం ప్రతిపక్ష నేతగా జగన్ చేశారని పేర్కొన్నారని...ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరైతే ముందుగా ఎజెండాను సెట్ చేస్తారో వారే ఎన్నికల్లో వందకు వందశాతం లాభడతారు.. ఎవరైతే ఇతరులు సెట్ చేసిన ఎజెండాకు రియాక్ట్ అవుతారో.. రెస్పాండ్ అవుతారో.. వారు పూర్తిస్థాయిలో ఎన్నికల్లో నష్టపోతారు.. ఈ రెండు పాయింట్‌లే రాజకీయాల్లో విజయాలు, అపజయాలను నిర్ణయిస్తాయని ప్రముఖ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ తెలిపారు.
ఇటువంటి క్రమంలో చంద్రబాబు ని తనని ఫాలో అయ్యే టట్లు జగన్ చేశారని ప్రత్యేక హోదా విషయంలో నైనా గాని పెంచిన పింఛన్ల విషయంలోనైనా గాని ఇది స్పష్టంగా తేలిందని అన్నారు. గతంలో మోడీ ఇలాగనే ముందు ఎజెండాను సృష్టించి తర్వాత అధికారంలోకి వచ్చారని అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎజెండాను సృష్టిస్తూ ఇతర పార్టీలు ఆ ఎజెండాకు రియాక్ట్ అవుతూ వచ్చాయి. దాని ఫలితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్న విషయాలను కే.నాగేశ్వర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న ఎన్నికలలో ఇదే సీన్ జగన్ క్రియేట్ చేశారని విశ్లేషించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మొత్తంమీద చూసుకుంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ సెట్ చేసిన ఎజెండాను ఫాలో అవుతారని ..దీనిబట్టి రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు.