వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన పిఏ..!

By Xappie Desk, April 10, 2019 14:57 IST

వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన పిఏ..!

వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన పిఏ..!
 
కరెక్ట్ గా 2019 ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ప్రచారం మొదలు పెట్టిన సమయంలో కడప జిల్లాలో వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసింది. వివేకానంద రెడ్డి హత్య పై తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకున్నారు. మొన్నటి వరకు ఏపీ లో ఉన్న రాజకీయాలు మొత్తం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఈ కేసు గురించి సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజా విచారణలో నిజాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయంటున్నారు అధికారులు.
 
మొదటగా ఆయన గుండెపోటుతో చనిపోయారని తొలిసారిగా చెప్పింది మాత్రం ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన ఆదేశాల మేరకే లక్ష్మి, రాజశేఖర్‌లు పడకగదిలో రక్తపు మరకలు తుడిచారని వివేకా పిఏ కృష్ణారెడ్డి చెప్పడంతో ఆ వాంగ్మూలానే పోలీసులు కోర్టుకు సమర్పించారు. గంగిరెడ్డి, ఇనాయతుల్లా, ట్యాంకర్‌ బాషా, రాజశేఖర్‌లు వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి తెచ్చారని తమకు కృష్ణారెడ్డి వెల్లడించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు, కోర్టు విధించిన కస్టడీ గడువు ముగియడంతో ఇటీవల నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఆపై కోర్టు వారికి 22 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.Top