జగనే సీఎం అని తేల్చేసిన పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: April 10, 2019 14:59 IST
జగనే సీఎం అని తేల్చేసిన పవన్ కళ్యాణ్..!

జగనే సీఎం అని తేల్చేసిన పవన్ కళ్యాణ్..!
 
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన నాటినుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన మాటల దాడిని వైసిపి అధినేత జగన్ పైన చేశారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పెద్దగా టార్గెట్ చేయకుండా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ పై విమర్శలు చేస్తున్న క్రమంలో చాలామంది పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కలిసిపోయారని ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఇందుమూలంగా నే జగన్ ని టార్గెట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ పార్టీ కి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ కుట్ర రాజకీయాలు పార్ట్నర్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పార్టీకి చెందిన నేతలు కొంతమంది కామెంట్ చేశారు.
 
అయితే ఎన్నికల చివరాకరికి వచ్చేసరికి తాజాగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసిపి పార్టీ అధినేత జగనే ముఖ్యమంత్రి అని తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ఏంటి జగన్ సీఎం అవుతాడనటం ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే, ఎన్నికల ప్రచార సభలో భాగంగా రాజమండ్రిలో పర్యటించిన పవన్, ఇటీవల వైసీపీలో చేరిన ప్రముఖ కమెడియన్, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అలీని ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఆలీకి జనసేన గెలుపు మీద నమ్మకం లేదని, పవన్ సీఎం అవ్వలేడు, జగనే సీఎం అవుతాడని భావించి ఆ పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆ వీడియోను తమకు అనుకూలంగా కట్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Top