జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు టాలీవుడ్ కుర్ర హీరో…!

Written By Xappie Desk | Updated: April 10, 2019 15:42 IST
జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు టాలీవుడ్ కుర్ర హీరో…!

జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు టాలీవుడ్ కుర్ర హీరో…!
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులు కంటే వీర అభిమానులు ఎక్కువ అని అలాగే హీరోలలో చాలామంది పవన్ కళ్యాణ్ హీరోయిజానికి ఫ్యాన్స్ ఉన్నారని అంటుంటారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.
 
ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ హిట్లతో దూసుకెళ్ళిపోతున్న హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అని మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా తాను నటించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ ఫోటో అయినా లేకపోతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలు అయినా ఉంచుకొని తన అభిమానాన్ని నితిన్ చాలాసార్లు చాటుకున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ పై మరొకసారి తన అభిమానాన్ని చాటుకున్నారు హీరో నితిన్. తన అభిమానాన్ని నితిన్ అనేక సార్లు స్వయంగా వెల్లడించిన నితిన్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.
 
పార్టీకి తన వంతుగా రూ.25 లక్షలు విరాలం ఇచ్చారు. ఇటీవల భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని.. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించి చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Top