సంచలనం: సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు పీకే సర్వే…!

Written By Aravind Peesapati | Updated: April 11, 2019 10:02 IST
సంచలనం: సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు పీకే సర్వే…!

సంచలనం: సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు పీకే సర్వే…!

 
వైసిపి పార్టీ అధినేత జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఒక రోజు ముందు తన టీం సభ్యులతో చేయించిన సర్వే ఫలితాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. గత కొంత కాలం నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసిపి పార్టీకి స్పష్టమైన ఫలితాలు వస్తున్న క్రమంలో మధ్యలో టిడిపి అధినేత చంద్రబాబు పలు ప్రజలు ఊహించని హామీలు ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న ఓటరు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రశాంతి కిషోర్ ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం పార్లమెంటు 25 స్థానాలలో వైసిపి పార్టీ 20 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం అని ప్రజా సెంబ్లీ 175 స్థానాల్లో 125 నుండి 140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ప్రశాంతి కిషోర్ చేసిన చివరి సర్వేలో ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా స్థానాలలో వైసీపీ పార్టీ దూసుకెళ్లి పోవడం ఖాయమని ఈ సర్వేలో తేలింది. ఇదే క్రమంలో టిడిపి పార్టీకి 25 నుండి 30 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని 5 ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఐదు నుండి పది అసెంబ్లీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో స్పష్టమైంది. మొత్తంమీద ఎలక్షన్ రోజు జరగక ముందు రోజు చేసిన ఈ సర్వేలో ఈ విధమైన ఫలితాలు రావడంతో రాష్ట్ర వైసీపీ నేతలు మంచి జోష్ మీద ఉన్నట్లు టాక్ వినపడుతోంది.
Top