కెసిఆర్ కి ఎన్నికల కమిషన్ నోటీసులు..!

Written By Aravind Peesapati | Updated: April 11, 2019 10:03 IST
కెసిఆర్ కి ఎన్నికల కమిషన్ నోటీసులు..!

కెసిఆర్ కి ఎన్నికల కమిషన్ నోటీసులు..!

 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని సాధించి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో కూడా అదే స్పీడ్ కొనసాగించాలని మంచి దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా తనదైన శైలిలో రాజకీయం చేస్తున్న కేసీఆర్ ఇటీవల పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభలో కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుండగా కెసిఆర్ కి ఇటీవల ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే కెసిఆర్ మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కమిషన్ అందిన పిర్యాదుల నేపద్యంలో ఈ నోటీసు ఇచ్చారు. ఈ నెల పన్నెండో తేదీ లోగా వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. కేసీఆర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. మరోవైపు కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేయడాన్ని వీహెచ్‌పీ స్వాగతించింది. టీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, కేసీఆర్‌కు చట్టపరంగా శిక్షపడేవరకూ తాము న్యాయపోరాటం చేస్తుందని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ అన్నారు.
Top