జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ భార్య..!
వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి గత కొంత కాలం నుండి రాజకీయ సలహాదారుడు గా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ తెలుగు రాజకీయాలలో ఇటీవల కీలకం అయ్యారు. ఇప్పటికే అనేకసార్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ పై అనేకసార్లు మండిపడిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తాజాగా ఆర్జెడి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గారి భార్య రబ్రదేవి ప్రశాంత్ కిషోర్ పై షాకింగ్ కామెంట్ చేసింది. ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ పార్టీని వేరే పార్టీలో విలీనం చేయాలని గతంలో తనతో పేర్కొన్నట్లు తెలిపారు లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి.
అలా చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన మంత్రిని ఎన్నుకునేది మనమే. మన చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది.. దేశ పాలన మన చేసేది కూడా మనమే.. ఇదంతా జరగాలంటే ముందుగా మీ పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలన్నాడు.. మహిళనైన నేను ఆయన్ను కొట్టలేక గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అంటూ చీదరించుకున్నానని రబ్రదేవి మీడియాకు చెప్పుకొచ్చారు. రబ్రదేవిని ప్రశాంత్ కిశోర్ కలవక ముందే తనతో ఈ విషయంపై చర్చించాడని లాలూ ప్రసాద్ యాదవ్ రాసిన తన జీవిత పుస్తకంలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తాను జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు లాలూ ప్రసాద్‌తో అనేకమార్లు బేటీ అయిన విషయం వాస్తవమేనని, ఆ బేటీల్లో తమ మధ్య చర్చకు వచ్చిన విషయాలు బయటకు చెప్తే ఆయన రాజకీయ జీవితం నాశనం అవుతుందని అన్నారు.