ఏపీ రాజకీయాలను ఆసక్తిగా మారిన తూర్పుగోదావరి ఓటర్..!

Written By Xappie Desk | Updated: April 15, 2019 10:59 IST
ఏపీ రాజకీయాలను ఆసక్తిగా మారిన తూర్పుగోదావరి ఓటర్..!

ఏపీ రాజకీయాలను ఆసక్తిగా మారిన తూర్పుగోదావరి ఓటర్..!
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటీవల జరిగిన ఎన్నికల గురించి మరియు రాబోతున్న ఫలితాల గురించి అనేకమంది విశ్లేషణలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటువంటి క్రమంలో ఆంధ్ర రాజకీయాలలో అధికారాన్ని డిసైడ్ చేసే తూర్పుగోదావరి జిల్లా ఓటర్ తాజాగా జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 80 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా 80 శాతం పోలింగ్ నమోదు అవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
 
గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న ఈ జిల్లా తాజాగా జరిగిన ఎన్నికలలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ముఖ్యంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీకి దాదాపు చాలా స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. అయితే మరో పక్క మాత్రం వైసిపి పార్టీ ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలవబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలలో చాలా తక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఓటర్ ఎక్కువగా డబ్బుకి గాని మద్యానికి గాని అమ్ముడు పోకుండా కేవలం రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారని..ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ఓటర్ ఎటు వైపు మొగ్గు చూపరో అన్న ఆసక్తి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Top