కర్ణాటకలో చక్రం తిప్పడానికి రెడీ అయిన చంద్రబాబు…!

Written By Xappie Desk | Updated: April 15, 2019 11:01 IST
కర్ణాటకలో చక్రం తిప్పడానికి రెడీ అయిన చంద్రబాబు…!

కర్ణాటకలో చక్రం తిప్పడానికి రెడీ అయిన చంద్రబాబు…!
 
రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు బట్టి తెలుస్తోంది. మొన్న పశ్చిమబెంగాల్ లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రాజకీయ పార్టీలను ఏకం చేసిన పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో హాజరైన చంద్రబాబు..త్వరలోనే కర్ణాటక లో జరగబోతున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.
 
ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కోసం చంద్రబాబు కర్నాటకలో ప్రచారం నిర్వహించనున్నాడు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు కి మద్దతుగా మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. మాండ్య పార్లమెంటు నియోజక వర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా నిఖిల్ పోటీచేస్తుండగా, నిఖిల్ కి వ్యతిరేకంగా మాండ్య పార్లమెంటు నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నటి సుమలత పోటీచేస్తున్నారు. ఒక్క మాండ్యలోనే కాదు బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో పలుచోట్ల తెలుగువారు అధికంగా ఉండే చోట్ల కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం చేయనున్నారు.
Top