టీడీపీ కొంపముంచిన పవన్ కళ్యాణ్..?

By Xappie Desk, April 15, 2019 11:04 IST

టీడీపీ కొంపముంచిన పవన్ కళ్యాణ్..?

టీడీపీ కొంపముంచిన పవన్ కళ్యాణ్..?
 
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన చంద్రబాబు అధికారంలోకి రావడానికి కీలకంగా మారారు పవన్ కళ్యాణ్. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా పోటీచేయడంతో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాలలో పవన్ అనుసరించిన వైఖరి చూస్తే టిడిపితో చీకటి రాజకీయ ఒప్పందాలు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ప్రత్యర్థి పార్టీల నేతలు కామెంట్లు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహాలు తమ పార్టీ కొంపముంచినట్లు పేర్కొంటున్నారు టీడీపీ శ్రేణులు. జనసేన ప్రభావం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా స్పష్టంగా కన్పిస్తోందని టీడీపీ ప్రముఖులు అంచనాకు వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలే అత్యంత కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది.
 
జనసేన ఒంటరి పోరుతో గోదావరి జిల్లాల్లో టీడీపీకి దారుణమైనన దెబ్బ తగలబోతోందని తేలింది. పవన్ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ ఐదు వేల నుంచి గరిష్టంగా కొన్ని చోట్ల 25 వేల వరకూ ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినందున ఆ ఓట్లు అన్నీ అప్పట్లో టీడీపీ ఖాతాలోకే వెళ్ళాయి. ఈ సారి పొత్తు లేకపోయినా కూడా టీడీపీ-జనసేనల మధ్య ‘రహస్య ఒప్పందం’ ఉందనే విషయాన్ని విఫక్ష వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళకలిగింది. దీంతో గోదావరి జిల్లాల్లోని కీలక సామాజిక వర్గం నేతలు..కార్యకర్తలు కూడా మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తారేమో అన్న కారణంతో చాలా వరకూ జగన్ వైపు మళ్ళారని తెలుగుదేశం పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ కొంపముంచినట్లు టిడిపి నేతలు కామెంట్ చేస్తున్నట్లు సమాచారం.Top