జగన్ తో దోస్తీ చేయడానికి రెడీ అవుతున్న కాంగ్రెస్..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయం తధ్యమని జాతీయ రాజకీయాల్లో జగన్ కీ రోల్ ప్లే చేస్తారని జాతీయ మీడియాలో వరుస కథనాలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి వైసీపీ అధినేత జగన్ వేసిన రాజకీయ అడుగులు చంద్రబాబు రాజకీయ కోటలకు బీటలు తెప్పించాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా తన తండ్రిని కోల్పోయి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ఎక్కడా కూడా రాజీ పడకుండా వేసిన అడుగులు ఏపీ ప్రజల గుండెల్లో జగన్ పై నమ్మకాన్ని పెంచాయని దీనికి అనుగుణంగానే 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పట్టారని చాలా మంది రాజకీయ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ లో జరిగిన ఎన్నికలలో జగన్ స్పష్టమైన మెజారిటీ తో గెలుస్తారు అన్న వార్తలు రావడంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ జగన్ తో కలవడానికి కలిసి పనిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు రావడం ఇప్పుడు అందరికీ షాక్ కు గురిచేశాయి. 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని తేలిపోవడంతో కాంగ్రెస్ జగన్ సపోర్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రంలో ఏపార్టీకి మెజారిటి రాకపోతె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అప్పుడు ప్రాంతీయ పార్టీలే ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఏపార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్ ఇప్పటినుంచె మద్దతు కూడగట్టుకొనేందుకు పావులు కదుపుతోంది.
దీనిలో భాగంగానె జగన్ తో సయోధ్య కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ మద్దతి ఇస్తే తప్పుడు కేసులు పెట్టినట్లు అంగీకరిస్తామని, తాము అధికారంలోకి వస్తే కేసులను క్లోస్ చేస్తామని, జగన్ కోరినట్లుగా ప్రత్యేక హోదా ఇస్తామని, అందుకోసం గులాం నబీ ఆజాద్ ను రాయబారానికి వినియోగించుకుంటున్నట్లు సమాచారం.