జగన్ కి అప్పుడే సెక్యూరిటీ పెంచేసిన కేంద్ర హోంశాఖ...?

Written By Aravind Peesapati | Updated: April 16, 2019 10:47 IST
జగన్ కి అప్పుడే సెక్యూరిటీ పెంచేసిన కేంద్ర హోంశాఖ...?

జగన్ కి అప్పుడే సెక్యూరిటీ పెంచేసిన కేంద్ర హోంశాఖ...?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి పార్టీ విజయం తధ్యమని జగనే ముఖ్యమంత్రి అని ఇప్పటికే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా భోజన సమయంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా గాని ప్రజలు ఎవరూ భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని గత ఎన్నికల కంటే 80% పోలింగ్ రాష్ట్రంలో నమోదవడంతో రాష్ట్రంలో జరిగిన సర్వేల ఫలితాలు మొత్తం కూడా వైసిపి పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ కి కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పాదయాత్ర సమయంలో జగన్ పై హత్యాయత్నం తర్వాత కొంచెం సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన కేంద్ర హోంశాఖ... తాజాగా జ‌గ‌న్ కు మ‌రింత హై సెక్యూరిటీని కేంద్ర హోంశాఖ కేటాయించింది. 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రానికి కాబోయె సీఎం జ‌గ‌నే అని ఇంట‌లిజెన్స్ స‌ర్వే రిపోర్ట్‌ను కేంద్ర‌హోంశాఖ‌కు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దాంతో సెంట్ర‌ల్ హోమ్ అఫైర్స్ క‌మిటీ హైసెక్యూరిటీని అలాట్ చేసిన‌ట్లు స‌మాచారం.
Top