రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

Written By Aravind Peesapati | Updated: April 16, 2019 10:51 IST
రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!
 
కేంద్రంలో ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన కామెంట్లతో ఇరుకున పడ్డారు. విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోదీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీచేసింది సుప్రీంకోర్టు. తన వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు నోటీసుల్లో ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని పేర్కొంది. రఫేల్‌ తీర్పుపై రాహుల్‌ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది.
Top