తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్..!

Written By Aravind Peesapati | Updated: April 16, 2019 10:53 IST
తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్..!

తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్..!
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జడ్పీ చైర్పర్సన్ పదవులు ఆఫర్ చేశారు. తాజాగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 32 జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ దక్కించుకునేలా పనిచేయాలని సూచించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇందుకుగానూ అసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పేరును ఆయన ప్రకటించారు. ఇక, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ గా ఇటీవల మంథని నుంచి ఓడిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరును ఖరారు చేశారు. ఓడిన వారికి ఇతర పదవులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
Top