యోగి ఆదిత్యనాథ్, మాయావతి కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

Written By Aravind Peesapati | Updated: April 16, 2019 10:57 IST
యోగి ఆదిత్యనాథ్, మాయావతి కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

యోగి ఆదిత్యనాథ్, మాయావతి కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!
 
కేంద్రంలో రాబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం సంపాదించాలని జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలు పట్ల ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా బిజెపి పార్టీ నాయకుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతపరంగా విద్వేషపూరిత మైన వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం చెందింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే విధంగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని మాయావతి ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేయడంతో ఆమెపై 48 గంటల పాటు ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా మతవిధ్వేషాలు రెచ్చగొడితే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇద్దరు ముఖ్యనేతలపై ఈసీ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.
Top