జగన్ కి చివరి రిపోర్టు అందజేసిన ప్రశాంత్ కిషోర్..?

Written By Aravind Peesapati | Updated: April 16, 2019 11:01 IST
జగన్ కి చివరి రిపోర్టు అందజేసిన ప్రశాంత్ కిషోర్..?

జగన్ కి చివరి రిపోర్టు అందజేసిన ప్రశాంత్ కిషోర్..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరి చూపు మే 23 వ తారీకు రాబోతున్న ఫలితాలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు గెలుపు మాదంటే మాది అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పోటీ టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య నెలకొన్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఈసారి మాదే అధికారం అంటూ ఎవరికి వారు కామెంట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో తన టీంతో కలిసి నిర్వహించిన సర్వే ఫలితాల తుది నివేదిక జగన్ కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ నివేదికలో మొత్తం 175 నియోజకర్గాలకు సంబంధించిన రిపోర్ట్ జగన్ కు వివరించారని సమాచరం. అయితే ఆ మొత్తం రిపోర్ట్ బయటకు రాకపోయినా, వైసీపీకి 115 స్థానాలు మాత్రం కచ్ఛితంగా వస్తాయని పీకే టీమ్ అంచనా వేసిందని సమచారం. పీకే టీమ్ లెక్కలు పక్కన బెడితే వైసీపీ గెలుస్తుందని రాష్ట్ర ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. మరి మే 23న రిజల్ట్ ఎవరి పక్కన నిలుస్తుందో చూడాలి.
Top