జగన్ జాతకం మార్చేసిన కొత్త ఇల్లు..?

Written By Xappie Desk | Updated: April 17, 2019 10:38 IST
జగన్ జాతకం మార్చేసిన కొత్త ఇల్లు..?

జగన్ జాతకం మార్చేసిన కొత్త ఇల్లు..?
 
వైసీపీ పార్టీ అధినేత ఇటీవల ఎన్నికలు జరగక ముందు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం దగ్గరగా ఉండే తాడేపల్లి లో గృహం కట్టించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇటీవల గృహంలో కుటుంబ సమేతంగా కూడా జగన్ అడుగుపెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జగన్ గ్రహం చుట్టూ ఒక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసి జగన్ గృహానికి వస్తున్న ఫోన్ కాల్ సంభాషణలను వింటున్నారని తెలుసుకున్న జగన్ వెంటనే తన మకాం తిరిగి లోటస్ పాండ్ లో పెట్టారు. అక్కడనుండి ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను మరియు పార్టీలో చేరే వారిని చేర్చు కోవడం జరిగింది. తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో 40 రోజుల్లో ఫలితాలు వస్తున్న క్రమంలో తీవ్ర ఉత్కంఠతో ఆంధ్రాలో ప్రధాన పార్టీలు ఉన్నాయి.
 
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ప్రజలంతా జగన్ కి ఓటు వేసినట్లు నెక్స్ట్ ముఖ్యమంత్రి జగనే అని అందరూ అనుకుంటున్న తరుణంలో ...అధికార పార్టీ టిడిపి కూడా పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు ఈవీఎం ల వ‌ల్ల 2019 ఎన్నికల్లో బాగా నష్టం జరిగిందని చంద్రబాబు ఇప్పటికే జాతీయస్థాయిలో గొంతు వినిపిస్తున్నారు. ఇదిలా వుంటే టీడీపీకి శ్రేణుల గుండెల్లో అనుబాంబు లాంటి వార్త‌ని ఓ వాస్తు సిద్ధాంతి పేల్చ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. వాస్తు పురుష ప్ర‌సాద్ బాంబు లాంటి వార్త పేల్చారు. ప్ర‌స్తుత గృహ వాస్తు ప్ర‌కారం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కి రాజ‌యోగం ప‌ట్ట‌నుంద‌ని, ఈ ద‌ఫా ఆయ‌న అధికారం చేప‌ట్ట‌డం ఖాయం అని తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో భ‌యం మొద‌ల‌వుతోంద‌ట‌. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు జగన్ కొత్త ఇల్లు... జగన్ జాతకం మార్చేసింది అని కామెంట్ చేస్తున్నారు.
Top