& ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలా చోట్ల సత్తెనపల్లి నియోజకవర్గం లో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ని కొట్టిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రజలే పోలింగ్ బూత్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా కోడెల శివప్రసాద్ వ్యవహరించారని ఇందుమూలంగా నే పోలింగ్ బూత్ దగ్గర ఉన్న ప్రజలు కోడెల శివప్రసాద్ పై చేయి చేసుకున్నట్లు టాక్ వినపడుతోంది. ఇటువంటి తరుణంలో కోడెల శివప్రసాద్ వైసీపీ పార్టీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ జన్మలో ముఖ్యమంత్రి అవ్వలేడు అని...రాజకీయంగా పైకి రావడం జగన్ కి చేతకాని పని ఇప్పుడైనా జగన్ తన ప్రవర్తన మార్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కోడెల. ఇంకా జగన్ గురించి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ..సత్తెనపల్లి నియోజకవర్గం లో తన ప్రత్యర్థి వైసీపీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తనకు ఏ మాత్రం ప్రత్యర్థి కాదని అసలు తనకు పోటీనే అతడు రాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై జరిగిన ఘటన గురించి కోడెల మాట్లాడుతూ..వైసీపీ నేతలు తప్పు చేసి మళ్లీ సిగ్గులేకుండా నిజనిర్ధారణ కమిటీ వేశారని శివప్రసాదరావు విమర్శించారు. ఇక తన పై భౌతికదాడి ఘటన పై ప్రజలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన పై దాడికి ప్రజలు ఓటుతో సమాధానం ఇస్తారన్నారని శివప్రసాదరావు. జగన్ ఇప్పటికే అసెంబ్లీ నుండి పారిపోయారని, ఆయన ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారని శివప్రసాదరావు విమర్శలు గుప్పించారు.