తమిళనాడులో టీచర్లు ట్యూషన్ ల గురించి కొత్త చట్టం..!

Advertisement

by Xappie Desk | April 17, 2019 11:07 IST
Follow Xappie
తమిళనాడులో టీచర్లు ట్యూషన్ ల గురించి కొత్త చట్టం..!

తమిళనాడులో టీచర్లు ట్యూషన్ ల గురించి కొత్త చట్టం..!
 
ఒకప్పుడు సమాజంలో చదువుకున్న వ్యక్తి అంటే చాలా గౌరవంగా చూసేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో చదువు ఒక వ్యాపారంగా మారి పోవడం తో అలాగే చాలామంది చదువుకుని నిరుద్యోగులుగా రోడ్డుపై చదువుకు తగ్గ పని దొరకక పొట్టకూటి కోసం దిగజారి బ్రతుకుతున్నారు. ముఖ్యంగా చదువులను అడ్డంపెట్టుకుని చాలా మంది డబ్బులు సంపాదించడానికి విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థులను పొద్దున నుండి సాయంత్రం వరకు ఏకదాటిగా వారిని నిర్బంధించే విధంగా చదువులు చెప్పడంతో చాలా విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
 
ఇటువంటి తరుణంలో తమిళనాడులో స్కూల్ టీచర్లు ఇకపై ట్యూషన్ లు చెప్పకూడదు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనను ఒక స్కూల్ నుంచి బదిలీ చేయడంపై ఒక టీచర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది.టీచర్లు స్కూల్ టైమ్ దాటిన తర్వాత ట్యూషన్ లు చెప్పడం కాని, పిల్లలను ట్యూషన్ కు ఇళ్లకు రావాలని చెప్పడం కాని తమిళనాడు చట్టం ప్రకారం చెల్లదని న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం తీర్పు చెప్పారు. పాఠశాలల్లో ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాలని, ట్యూషన్ లపై టీచర్ ల మీద విద్యార్దులు, తల్లిదండ్రులు పిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని, వీటితో పాటు లైంగిక వేధింపులపై కూడా పిర్యాదు చేసే వీలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.


Advertisement


Advertisement

Top