నేను ఎవరికి పోటీకి రావడం లేదు అంటున్న ప్రకాష్ రాజ్..!

Written By Xappie Desk | Updated: April 18, 2019 14:04 IST
నేను ఎవరికి పోటీకి రావడం లేదు అంటున్న ప్రకాష్ రాజ్..!

నేను ఎవరికి పోటీకి రావడం లేదు అంటున్న ప్రకాష్ రాజ్..!
 
గతంలో బెంగుళూరులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో తాజాగా రాబోతున్న ఎన్నికలలో బెంగళూరు నగరం నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయట్లేదని, తాను ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు. ఒకవేళ సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు.
 
అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వారన్న విషయం ముఖ్యం కాదని, సరైన నాయకుడా? కాదా? అన్న విషయాన్ని చూడాలని ఆయన సూచించారు.‘ఒక పార్టీ ఏడాదికి రూ.72,000 అందిస్తామని చెబుతోంది. మరోపార్టీ రైతులకు రూ.6,000 ఇస్తామని చెబుతోంది. మన డబ్బునే పన్నుల రూపంలో తీసుకొని, ఓ స్వచ్ఛంద సంస్థల్లా ఇస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి. ప్రతిపౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని భాజపా చెప్పిన మాట ఏమైంది. ఆ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అంతేగానీ, వారి మేనిఫెస్టోల్లో ప్రకటించిన అంశాల్లో ఓ విజన్‌గానీ, మంచి ఉద్దేశంగానీ లేదు’ అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.
Top