చంద్రబాబు వస్తుంటే దండం పెట్టేస్తున్నా జాతీయ పార్టీ నాయకులు..?

Written By Xappie Desk | Updated: April 18, 2019 14:07 IST
చంద్రబాబు వస్తుంటే దండం పెట్టేస్తున్నా జాతీయ పార్టీ నాయకులు..?

చంద్రబాబు వస్తుంటే దండం పెట్టేస్తున్నా జాతీయ పార్టీ నాయకులు..?
 
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత రోజు నుండే ఈవీఎంల విషయంలో చంద్రబాబు గగ్గోలు పెడుతూ చిత్రవిచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014 ఎన్నికలు ఇదే ఈవీఎంలపై అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు జగన్. తాను ఓడిపోతున్నాడు అని తెలిసి చంద్రబాబు ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టుతున్నారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు మాటిమాటికి ఎన్నికలు జరిగిన సరళి గురించి ఢిల్లీలో ప్రతిసారి మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీల నాయకులను కలవడానికి వెళుతున్న చంద్రబాబుకి జాతీయ పార్టీల నాయకులు దండం పెట్టేస్తున్నారు అంటూ విమర్శించారు వైసీపీ పార్టీకి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి.
 
చంద్రబాబు ఓటమి గురవుతున్నారనే తెలిసే జాతీయ నాయకులు ఈయనను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తను చేసే తప్పుడు పనులను ఎదుటివారిపై ఆపాదిస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు చుట్టూరా ఉన్నదంతా దోపిడీదారులు, మోసగాళ్లేనని ఆయన అన్నారు. ఈవిఎమ్ దొంగ హరిప్రసాద్, ఐటి గ్రిడ్స్ డేటా చౌరీకి పాల్పడిన అశోక్ తదితరులు అంతా చంద్రబాబు చుట్టూరా ఉన్నారని ఆయన అన్నారు.తన ఓటమిని ఈవిఎమ్ లపై నెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.మరి నంద్యాలలో ఉప ఎన్నికలో హరిప్రసాద్ ను ఉపయోగించి టాంపరింగ్ చేసి గెలిచారా అని శ్రీకాంతరెడ్డి ప్రశ్నించారు. జనాన్ని ఓటింగ్ కు రాకుండా చేయడానికి కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేశారని, కాని ప్రజలు విషయం అర్దం చేసుకుని ఓటింగ్ లో పాల్గొన్నారని ఆయన అన్నారు.
Top