తనపై టీడీపీ మర్డర్ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్న హర్ష కుమార్..!

By Xappie Desk, April 18, 2019 14:10 IST

తనపై టీడీపీ మర్డర్ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్న హర్ష కుమార్..!

తనపై టీడీపీ మర్డర్ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్న హర్ష కుమార్..!
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఎంపీ హర్షకుమార్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సరైన ఆదరణ దక్కకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా మొన్నటి వరకు ఉన్నారు. అయితే తాజాగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ హర్షకుమార్ అనకాపల్లి ఎంపీ టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానానికి తనకి సరైన అవగాహన లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన హర్షకుమార్ తాజాగా తెలుగుదేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి టిడిపి కుట్ర చేస్తోందని ఆయన అంటున్నారు.
 
ఎన్నికల ముఖ్య అదికారి ద్వివేదికి ఆయన ఫిర్యాదు చేశారు.ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను తెలుగు దేశం పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరినట్టు చెప్పారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా విచారణ మాత్రం జరగడం లేదని వాపోయారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ద్వివేదిని కోరానని చెప్పారు.Top