జగన్ గెలిస్తే టాలీవుడ్ లో మార్పులు కాయం అంటున్న సినిమా విశ్లేషకులు..?

Written By Xappie Desk | Updated: April 18, 2019 14:12 IST
జగన్ గెలిస్తే టాలీవుడ్ లో మార్పులు కాయం అంటున్న సినిమా విశ్లేషకులు..?

జగన్ గెలిస్తే టాలీవుడ్ లో మార్పులు కాయం అంటున్న సినిమా విశ్లేషకులు..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు ముగియడంతో రాబోతున్న ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ అయినా.. మంచి ఫైట్ మాత్రం వైసిపి- టిడిపి పార్టీల మధ్య ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎక్కువ శాతం వైసిపి పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా జగన్ గెలిస్తే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మార్పులు చాలా చోటుచేసుకుంటాయని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు.
 
నందమూరి తారకరామారావు హయాం నుండి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించారాని..విభజన జరిగినా తెలుగుదేశం పార్టీకి చెందిన మనుషులే ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ పార్టీకి గడ్డుకాలం ఉన్న క్రమంలో రాబోయే ఎన్నికలలో జగన్ గెలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏలుతున్న టీడీపీ మనుషులకు చెక్కు పెట్టినట్లు అవుతుందని ఇందుమూలంగా నే చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులు క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు, జయసుధ, ఆలీ, రాజశేఖర్, జీవిత, పోసాని క్రిష్ణ మురళి, ఎస్వీ క్రిష్టారెడ్డి, క‌మెడ‌గియ‌న్ పృద్వీ, వినాయకుడు ఫేం రాజు ఇలా అనేకమంది టాలీవుడ్‌కు చెంద‌ని నటులు జగన్ ముఖ్య‌మంత్రి కావాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.
Top