లోకేష్ సైలెంట్ అవడం పై రకరకాల వార్తలు..!

Written By Xappie Desk | Updated: April 18, 2019 14:43 IST
లోకేష్ సైలెంట్ అవడం పై రకరకాల వార్తలు..!

లోకేష్ సైలెంట్ అవడం పై రకరకాల వార్తలు..!
 
మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో పోటీ పడుతున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నారా లోకేష్ గెలుపు గురించి ఇప్పటికే చాలా మంది బెట్టింగులు మీద బెట్టింగ్ లు వేస్తున్నారు. ఎక్కువగా నారా లోకేష్ ఓడిపోవడం గ్యారెంటీ అని బెట్టింగ్ రాయుళ్లు పందెం కడుతున్నారు. ఇక‌పోతే ఎన్నిక‌ల ముందు ప్ర‌చారం పేరుతో బోలెడ‌న్ని కామెడీలు చేసిన నారా లోకేష్ బాబు ఎందుక‌నో ఎల‌క్ష‌న్ త‌ర్వాత మాత్రం గ‌ప్ చుప్ గా క‌నిపిస్తున్నారు.
 
ఆయ‌న‌లో ఉన్న‌ట్టుండి ఎందుకింత టెన్ష‌న్ అంటూ వైకాపా శ్రేణులు ఓకింత సెటైర్లు పేల్చేందుకు వెన‌కాడ‌డం లేదు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ గెలుస్తాడా? అంటే సందేహ‌మేన‌ని అంతా మాట్లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి లోకేష్ లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడేందుకు సాహ‌సించ‌డం లేద‌ని మాట్లాడుకుంటున్నారు. గెలిస్తే ఓకే.. కానీ ఓట‌మి పాలైతే అటుపై జ‌నాల‌కు ఏమ‌ని మొహం చూపించాలి? అంటూ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంద‌ట‌. ఆ అంత‌ర్మ‌ధ‌నంలోనే చిన‌బాబు బ‌య‌ట ఎక్క‌డా సంద‌డి చేయ‌డం లేద‌ని.. సైలెంట్ అయిపోయార‌ని సెటైర్లు పేల్తున్నాయి. మరోపక్క వైసీపీ పార్టీ కాండేట్ ఆర్ కె ఈసారి గెలిస్తే మాత్రం మంత్రి పదవి ఖాయమని జగన్ పేర్కొనడంతో..మంగళగిరిలో వైసీపీ పార్టీ వర్సెస్ టిడిపి పార్టీ క్యాండిడేట్ లా పోటా పోటీ ఆసక్తికరంగా మారింది
Top