ఎన్నికల కమిషన్ పై రెచ్చిపోయిన చంద్రబాబు..?

Written By Xappie Desk | Updated: April 20, 2019 17:07 IST
ఎన్నికల కమిషన్ పై రెచ్చిపోయిన చంద్రబాబు..?

ఎన్నికల కమిషన్ పై రెచ్చిపోయిన చంద్రబాబు..?
 
తాజాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రోజు నుండి ఎన్నికల కమిషన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ గల్లీ నుండి ఢిల్లీ దాకా మీడియా సాక్షిగా సంచలన కామెంట్ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారం ముగిసిన సాయంత్రం నాడే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పై గొడవకు దిగిన చంద్రబాబు అదే వేడిని ఎన్నికలు ముగిసిన కొనసాగిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా కారణం ఏమైనా రాష్ట్ర స్తాయి అదికారి ఒకరిని బదిలీ చేసి ఎన్నికల కమిషన్ తో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గొడవకు సిద్దం అయ్యారని వార్తలు వస్తున్నాయి. కాపు కార్పొరేషన్ ఎమ్.డి.శివశంకర్ ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందట. అయితే దీనికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చేసిందని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అధికారిని ఎవరిని ఇలా ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా బదిలీ చేయరాదని చెబుతున్నారు. దాంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంమీద చంద్రబాబు ఎన్నికలు ముగిసిన ఈసీ పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Top