రాహుల్ కి నేను అండగా ఉంటా అంటున్న దేవెగౌడ..!

Written By Xappie Desk | Updated: April 20, 2019 17:11 IST
రాహుల్ కి నేను అండగా ఉంటా అంటున్న దేవెగౌడ..!

రాహుల్ కి నేను అండగా ఉంటా అంటున్న దేవెగౌడ..!
 
ప్రస్తుతం దేశ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఈసారి ఎలాగైనా బిజెపి పార్టీని కిందకి దించాలని జాతీయ స్థాయిలో ఉన్న చాలా పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో జేడీఎస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ తనకి ప్రధాని అవడంపై ఆశలేదని అటువంటి ఆలోచన కూడా లేదని కానీ మోడీ మరొకసారి ప్రధాని అవుతారన్న భయం ఉందని అంటున్నారు.
 
తన తండ్రి దేవెగౌడ మళ్లీ ప్రదాని అవుతారని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటనపై ఆయన స్పందించి ఈ వ్యాఖ్య చేశారు.ప్రధానిని ముఖం మీద అడిగే దమ్ము,దైర్యం తనకు ఉన్నాయని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని ఆయన అన్నారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. తాను జెడిఎస్ దెబ్బతినకుండా చూడడానికి ప్రాధాన్యం ఇస్తున్నానని ఆయన అన్నారు. దీంతో దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top