సొంతంగా సర్వే చేయించుకున్న జగన్..!

Written By Xappie Desk | Updated: April 20, 2019 17:25 IST
సొంతంగా సర్వే చేయించుకున్న జగన్..!

సొంతంగా సర్వే చేయించుకున్న జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక వైసీపీ పార్టీ అధినేత జగన్ విజయం మీద ధీమాగా ఉన్నట్లు మీడియా ముందు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు ముగిశాక 40 రోజుల గ్యాప్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సర్వేలు కచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని జగనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని తెలియజేస్తున్న క్రమంలోనే వైసిపి పార్టీ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కూడా పక్కా కాన్ఫిడెంట్ గా వైసీపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది.
 
ఇదే క్రమంలో ఇప్పటివరకు జగన్ తెప్పించుకున్న చాలా రిపోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ 80 పైగా అసెంబ్లీ స్థానాల‌ను క‌చ్చితంగా గెలుస్తార‌ని కొన్ని సీట్ల‌లో ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని ఒక స‌ర్వే…. మ‌రికొన్ని స‌ర్వేలు 90కి పైగా సీట్లు క‌న్ఫామ్ అని డిక్లేర్ చేశాయి. జ‌గ‌న్‌కు అందిన ఆరు స‌ర్వేల్లో ఒక స‌ర్వే ఏకంగా వైసీపీ 130 సీట్ల వ‌స్తాయ‌ని అంచానా వేసింది.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేయించిన సొంత స‌ర్వేలో మాత్రం ఆ పార్టీకి 117 నుంచి 120 సీట్లు గెలుపొందుతుంద‌ని, జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి త‌న టీమ్‌తో చేయించిన స‌ర్వే క‌నుక ఈ స‌ర్వేపై పార్టీ నాయ‌కుల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరుగుతోందంట‌. ఇందులో ఎంత వాస్త‌వం ఉందో గాని సోష‌ల్ మీడియాలో మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
Top