దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై బద్ద శత్రువులు..!

Written By Xappie Desk | Updated: April 20, 2019 17:31 IST
దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై బద్ద శత్రువులు..!

దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై బద్ద శత్రువులు..!
 
ప్రస్తుతం దేశమంతటా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న మోడీకి ఈసారి ఎలాగైనా అధికారం దూరం చేయాలని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు మరియు నాయకులు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటినుండో తమ మధ్య ఉన్న పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి కలవటం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి రాజకీయరంగంలో శాశ్వత మిత్రులు మరియు శాశ్వత శత్రువులు ఉండరు అని మరొకసారి రుజువయ్యింది. ఇదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బయటపడింది. రాజ‌కీయా అవ‌స‌రాల‌కోసం బ‌ద్ద‌శ‌త్రువులుగా ఉన్న క‌ల‌సిపోతున్నారు. ఒకప్పటి బద్ధ శత్రువులు.. ఇవాళ ఒకే వేదికను పంచుకోనున్నారు. అది ఎవరంటే.. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి. ఈ ఎన్నిక‌ల్లో భాజాపాను మ‌రో సారి అధికారంలోకి రాకుండా ఈ రెండు పార్టీలు క‌ల‌సి పోటీ చేస్తున్నాయి.ములాయం సింగ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పూరి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీలో ములాయం, మాయావతితో పాటు ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ పాల్గొననున్నారు.
Top