సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్న విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ ట్విట్ల పర్వం…!

Written By Xappie Desk | Updated: April 21, 2019 11:18 IST
సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్న విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ ట్విట్ల పర్వం…!

సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్న విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ ట్విట్ల పర్వం…!
 
తాజాగా ఇటీవల వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మరియు జనసేన పార్టీ పార్లమెంటు విశాఖపట్టణం అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్ల పర్వం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణ టీడీపీకి అనుకూలంగా పని చేశారు అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ లపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మీడియాతో మాట్లాడిన జేడీ లక్ష్మి నారాయణ జనసేన పార్టీ 85 స్థానాల నుండి దాదాపు 140 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చేసిన కామెంట్ పై మొదలైన ఈ రచ్చ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది.
 
దీంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ అకౌంట్ లో...“లక్ష్మీనారాయణ గారూ… మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్! నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!”. “జేడీ గారూ… మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి… నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి…ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా… ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?”. “జేడీ గారూ… మీ టిక్కెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది…. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు. కాదు… మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!” అంటూ మళ్ళీ సంచలానికి దారి తీసే ట్వీట్లు పెడుతున్నారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ నెటిజన్లలో పెద్ద అగ్గి రాజేస్తునట్లు తెలుస్తోంది.
Top