వివేక హత్యకేసులో అసలు ఏం జరుగుతుంది..?

Written By Xappie Desk | Updated: April 21, 2019 11:23 IST
వివేక హత్యకేసులో అసలు ఏం జరుగుతుంది..?

వివేక హత్యకేసులో అసలు ఏం జరుగుతుంది..?
 
వైసీపీ పార్టీ అధినేత జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య విషయమై వైసిపి టిడిపి పార్టీలో ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు ముగిశాక అసలు ఈ హత్య కేసులో ఏం జరుగుతుందో అన్న విషయం గురించి రాష్ట్రంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
 
గతంలో చూసుకుంటే ఈ హత్య కేసును విచారిస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైయస్ వివేకానంద రెడ్డి కూతురు మరియు భార్య న్యాయస్థానాలను చట్టసభలను కోరడం జరిగింది. కానీ ప్రస్తుతానికి అయితే సిట్ విచారణలోనే ఇంకా ఈ కేసు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుంది.? దీనికంటూ ఒక ముగింపు ఏమన్నా ఉందా అన్నది మాత్రం అంతు చిక్కని ప్రశ్న గానే మిగిపోయింది. దీనితో ఈ కేసుపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో లేదా సమాధానం దొరకని ప్రశ్న లాగే మిగిలిపోతుందా అన్నది చూడాలి.
Top