ఎవరు ఊహించని విధంగా మోడీ పై సంచలన కామెంట్స్ చేసిన విజయశాంతి..!

By Xappie Desk, April 21, 2019 11:34 IST

ఎవరు ఊహించని విధంగా మోడీ పై సంచలన కామెంట్స్ చేసిన విజయశాంతి..!

ఎవరు ఊహించని విధంగా మోడీ పై సంచలన కామెంట్స్ చేసిన విజయశాంతి..!
 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తన రాజకీయ జీవితం బీజేపీ నుండి మొదలైందని విజయశాంతి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో ఉన్న చాలామంది నేతలకు తన గురించి బాగా తెలుసని అంటూ ప్రధాని మోడీ వంటి నేర చరిత్ర కలిగిన వారు మరొకరు లేరని విజయశాంతి ఆరోపించారు.
 
ముఖ్యంగా ప్రదానికి ఉండవలసిన లక్షణాలు మోడీ లో లేవని ఆమె అన్నారు.ఈ ఎన్నికలు మోడీకి, రాహుల్ గాందీకి మద్య జరుగుతున్న పోరు అని ఆమె పేర్కొన్నారు. మోదీ కేవలం అబద్ధాలతోనే దేశాన్ని మోసగించారని దుయ్యబట్టారు. భాజపా ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలకు సూచించారు. కర్నాటకలోని సేడంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో విజయశాంతి ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లు జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top