అసలు వైసీపీ పార్టీ గెలిచే చాన్సే లేదు అంటున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: April 21, 2019 11:38 IST
అసలు వైసీపీ పార్టీ గెలిచే చాన్సే లేదు అంటున్న చంద్రబాబు..!

అసలు వైసీపీ పార్టీ గెలిచే చాన్సే లేదు అంటున్న చంద్రబాబు..!
 
టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతిలో. తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం అని అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీ మైండ్గేమ్ ఆడుతోందని ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అండ‌ర్ కరెంట్ ఉంద‌ని తెలిపారు.
 
ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్నా అక్క‌డ ఓటేయ‌కుండా దొరికిన వాహ‌నాన్ని ప‌ట్టుకొని ల‌క్ష‌ల మంది ఏపీకి వ‌చ్చి ఓటేశార‌ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని వారి చిత్తశుద్ధితో ఓటేశార‌ని పేర్కొన్నారు. న‌రేంద్ర మోడీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, అధికారులు మోడీని చూసి కాకుండా ప్ర‌జ‌ల‌ను చూసి ప‌నిచేయాల‌న్నారు. త‌న‌కు ఈసీ, సీబీఐతో వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి విభేదాలు లేవ‌న్నారు.అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌ర‌ప‌డంపై ఈసీ ఆంక్ష‌లు విధించ‌డం హేయ‌మ‌ని ఆరోపించారు. ఈసీ విధానాల‌పై త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.
Top