రామోజీరావు ఇంటిలో శుభకార్యానికి జగన్ ఎందుకు హాజరు కాలేదు..?

Written By Xappie Desk | Updated: April 22, 2019 12:38 IST
రామోజీరావు ఇంటిలో శుభకార్యానికి జగన్ ఎందుకు హాజరు కాలేదు..?

రామోజీరావు ఇంటిలో శుభకార్యానికి జగన్ ఎందుకు హాజరు కాలేదు..?
 
రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న రాజకీయ నేతలు అందరికి తెలిసిన విషయమే అదేమిటంటే రామోజీరావు మరియు వైయస్ కుటుంబాల మధ్య అనేక రాజకీయ వివాదాలు ఉన్నాయి అని. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రి పీఠం లో ఉన్నప్పుడు రామోజీరావు పై అనేకమైన కేసులు వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో రామోజీరావు కూడా వైయస్ కుటుంబం పై మరియు ఆయన రాజకీయ జీవితంపై తన పత్రికల్లో మరియు మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అనేకమైన కథనాలు ప్రసారం చేసేవారని అంటుంటారు వైయస్ సన్నిహితులు.
 
అయితే వైఎస్ మరణించాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ జగన్ రామోజీరావు ని కలవడం జరిగింది. స్వయంగా జగనే రామోజీరావు ఇంటికి వెళ్లి కలవటంతో అప్పట్లో వీరిద్దరి భేటీ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. దీంతో రామోజీరావు వైయస్ కుటుంబాల మధ్య సయోధ్య నెలకొన్నట్లు అందరూ అనుకున్నారు. అయితే తాజాగా రామోజీరావు ఇంటిలో మనవరాలి పెళ్లి కి రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన రాజకీయ ప్రముఖులు అంతా హాజరైన గానీ వైయస్ జగన్ హాజరు కాకపోవడంతో ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తమ్మీద చూసుకుంటే ఇద్దరి మధ్య వైరం కొనసాగుతున్నట్లే ఉందని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.
Top