ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సారి బయటకు వచ్చిన పవన్..!

Written By Aravind Peesapati | Updated: April 22, 2019 12:45 IST
ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సారి బయటకు వచ్చిన పవన్..!

ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సారి బయటకు వచ్చిన పవన్..!
 
ఏప్రిల్ 11న ఎన్నికలు ముగియడంతో ఆంధ్ర లో ఉన్నా అన్ని ప్రధాన పార్టీల నేతలు మీడియా ముందు కనపడటం జరిగింది. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కూడా కనబడలేదు. దీంతో చాలామంది ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటికల్ లీడర్ అని ఇలా అనేక రకరకాల వార్తలు కామెంట్లు పొట్టి వచ్చాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యాలయాలు ఖాళీ అయిపోయాయని పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయిందని ఇలా అనేకమైన కామెంట్లు ఈ మధ్య వినబడ్డాయి.
 
అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చేలా గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో అందరూ షాక్ తిన్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఎన్నికల సరళి ఎలా జరిగింది, అభ్యర్థుల ప్రచారం ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష పవన్ కళ్యాణ్ జరిపారట. మొదటి విడతగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అభ్యర్థులతో మాట్లాడుతున్న పవన్ త్వరలోనే మిగతా జిల్లాల అభ్యర్థులతో కూడా చర్చలు జరుపుతారట. ఇదే క్రమంలో పవన్ బహిరంగంగా మీడియా ముందుకు వస్తే అభిమానులకు, కార్యకర్తలకు కూడా కొంత ఊరటగా ఉంటుంది అని మరి కొంతమంది అంటున్నారు.
Top