ఆ సర్వేలో ఫలితాన్ని చూసి రెచ్చి పోతున్న విజయ్ సాయి రెడ్డి..?

Written By Xappie Desk | Updated: April 22, 2019 12:47 IST
ఆ సర్వేలో ఫలితాన్ని చూసి రెచ్చి పోతున్న విజయ్ సాయి రెడ్డి..?

ఆ సర్వేలో ఫలితాన్ని చూసి రెచ్చి పోతున్న విజయ్ సాయి రెడ్డి..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్లింది అంటూ సర్వేలు చెబుతున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన నాయకులు ఇతర పార్టీలను టార్గెట్ చేస్తూ మీడియా ముందు బీభత్సమైన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికలలో... 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అధికార పీఠాన్ని దూరం చేసిన జనసేన పార్టీకి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసే డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు బలంగా జరిగిన ఎన్నికల్లో నమ్మినట్లు వైసీపీ పార్టీ కి చెందిన నేతలు చేసిన సర్వేలో తేలడంతో ఆ పార్టీకి చెందిన విజయ సాయి రెడ్డి జనసేన పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ఎకౌంట్లో రెచ్చిపోతున్నారు.
 
ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ మరియు విజయసాయి రెడ్డి ల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. మొత్తం మీద వైసిపి పార్టీ 2014 ఎన్నికల్లో తమని బలంగా దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ కి తాజాగా జరిగిన ఎన్నికల్లో స్వయంగా చేసిన సర్వేలో దారుణమైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి జనసేన పార్టీ ని గట్టిగా టార్గెట్ చేశారనే కామెంట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి.
Top