మోడీని జైలుకు పంపిస్తాం అంటూ రెచ్చిపోయిన రాహుల్ గాంధీ..!

Written By Xappie Desk | Updated: April 22, 2019 12:50 IST
మోడీని జైలుకు పంపిస్తాం అంటూ రెచ్చిపోయిన రాహుల్ గాంధీ..!

మోడీని జైలుకు పంపిస్తాం అంటూ రెచ్చిపోయిన రాహుల్ గాంధీ..!
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది జాతీయ కాంగ్రెస్ పార్టీ. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో తాజాగా జరుగుతున్న ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ని ఎలాగైనా అధికార పీఠం నుండి కింద కు దించాలని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాహుల్ గాంధీ.
 
ఈ నేపథ్యంలో తాజాగా రఫేల్ యుద్ద విమానాల కాంట్రాక్టులో జరిగిన అవినీతి బయటకు వస్తే ప్రదాని మోడీ జైలుకు వెళ్లవలసి వస్తుందని ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు.తాము అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామనిఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ది హిందూ’ పత్రిక బయటపెట్టిన పత్రాలతో మోదీ పాత్ర బట్టబయలైందన్నారు. చర్చల బృందాన్ని పక్కనపెట్టి మోదీ నేరుగా ‘డసో’ కంపెనీతో బేరసారాలు జరిపారని ఆరోపించారు. మోదీని జైలుకు పంపడానికి ఈ ఆధారాలు చాలని రాహుల్ అన్నారు.
Top