జీవితంలో చంద్రబాబు కల నెరవేరదు అంటున్న అంబటి రాంబాబు..!

Written By Aravind Peesapati | Updated: April 22, 2019 12:52 IST
జీవితంలో చంద్రబాబు కల నెరవేరదు అంటున్న అంబటి రాంబాబు..!

జీవితంలో చంద్రబాబు కల నెరవేరదు అంటున్న అంబటి రాంబాబు..!
 
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు కంటున్న కలలు నెరవేరదు అంటూ వైసిపి పార్టీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఇటీవల మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజల నుండి వచ్చిన ఆదరణ చూసి చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని దీంతో ఆ నెపాన్ని వ్యవస్థలపై వేసి వాటిని దోషిగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు చంద్రబాబు మీడియా ముందు నోటికి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారని ఆరోపించారు.
 
ఐదేళ్లలో పాలనలో చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. వ్యవస్థలు దోషులు కావనీ, చంద్రబాబే దోషి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ద్రోహం చెసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పార్టీ కోసం వాడుకున్నారన్నారు. పుత్రుడు లోకేష్‌ కోసం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను పక్కకు నెట్టేశారని విమర్శించారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలనే చంద్రబాబు జీవిత కల ఎప్పటికీ నేరవేరదన్నారు. చంద్రబాబు దుష్ట పాలన అం‍తం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Top