కుటుంబ సమేతంగా సమ్మర్ టూర్ కి వెళ్ళిన జగన్..!

Written By Aravind Peesapati | Updated: April 23, 2019 10:44 IST
కుటుంబ సమేతంగా సమ్మర్ టూర్ కి వెళ్ళిన జగన్..!

కుటుంబ సమేతంగా సమ్మర్ టూర్ కి వెళ్ళిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో జగన్ రోజుకి కనీసం నాలుగు జిల్లాల్లో నాలుగు మహాసభలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడిపే వారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం సాయంత్రం పూట మాత్రమే ఎన్నికల ప్రచారం చేసేవారు. అయితే తాజాగా ఎన్నికలు పూర్తయిన క్రమంలో ఎక్కువ గెలిచే అవకాశాలు వైసీపీ అధినేత జగన్ కి ఉండటంతో ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారటానికి ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చంద్రబాబు అభద్రతా భావంతో ఉన్నారని ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ మాత్రం సమ్మర్ సందర్భంగా కుటుంబ సమేతంగా విదేశీ టూర్ చెక్కేసారు. వేసవి సందర్భంగా దాదాపు ఐదు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీ గా స్విట్జర్లాండ్ లో గడపనున్నాడని సమాచారం. మళ్ళీ జగన్ ఈ నెల 27 న తిరిగి స్వదేశానికి రానున్నాడని సమాచారం.
Top