ఈసారి మాత్రం జగనే అంటున్న ఉండవల్లి..!

Written By Aravind Peesapati | Updated: April 23, 2019 10:48 IST
ఈసారి మాత్రం జగనే అంటున్న ఉండవల్లి..!

ఈసారి మాత్రం జగనే అంటున్న ఉండవల్లి..!
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన ఎన్నికల విషయంలో తామంటే తాము గెలుస్తామని ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ నేతలు మీడియా ముందు తెగ డబ్బాలు కొడుతున్న క్రమంలో తాజాగా ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ...ఓట్ల కోసం ప్ర‌భుత్వ డబ్బును పంచ‌డం మ‌న రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డ చూడ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఈ ఎన్నిక‌ల‌కు రెండు నెల‌లు ముందు ప్ర‌భుత్వ ఖ‌జానా నుండి డ్వాక్రా మ‌హిళ‌ల‌కు 10వేలు ఇచ్చార‌ని, అయితే వారంతా టీడీపీకే ఓట్లు వేస్తార‌ని గ్యారెంటీ లేద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. ఎందుకంటే టీడీపీ ప‌సుపు కుంకుమ ప‌థ‌కంలో మ‌త‌ల‌బును వైసీపీ శ్రేణులు ఎండ‌గ‌ట్టార‌ని, డ్వాక్రా మహిళలకు ఇన్నాళ్ళు వడ్డీ డబ్బులు ఇవ్వకుండా, పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని వైసీపీ చేసిన ప్రచారం కూడా బాగానే ప్రజల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో జ‌నాల్లో వైసీపీ మైలేజ్ ఫుల్‌గా పెరిగిపోయింద‌ని, దీంతో జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు పిక్స్ అయిపోయార‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
Top